WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని సిటిజన్ క్లబ్లో ప్రభుత్వం తరఫున నిన్న సాయంత్రం ఫ్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు జననం ప్రపంచ కాలగణనను క్రీస్తుపూర్వం, క్రీస్తు శకంగా మార్చేంత మహత్తరమైందని అన్నారు.