PDPL: రామగుండం బి పవర్ హౌస్ బస్టాండ్ వద్ద దిక్కుతోచని స్థితిలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వయోవృద్ధురాలిని జిల్లా యంత్రాంగం ఆదుకుంది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా FRO స్వర్ణలత అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ వృద్ధురాలికి శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు HYD చౌటుప్పల్లోని ‘అమ్మానాన్న ఆశ్రమానికి’ తరలించారు.