E.G: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రికి చెందిన వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ ఢిల్లీ రావు, డైరెక్టర్ గోవిందరావు, కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు.