E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణకు ప్రతీకగా నిలిచిన యేసు ప్రభువు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన జీవనమార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త యేసు ప్రభువు అని ఆయన అన్నారు.