SKLM: ఆమదాలవలస మండలం దూసి రోడ్డు వద్ద అధిక లోడుతో వెళ్తున్న రెండు ఇసుక లారీలను మంగళవారం రాత్రి శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్. వివేకానంద్ సీజ్ చేశారు. దూసి ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా అధిక లోడుతో తరలిస్తున్న లారీలను పట్టుకున్నట్లు ఆమదాలవలస ఎస్సై బాలరాజు బుధవారం తెలిపారు. లారీలపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.