AKP: అనకాపల్లి మండలం శంకరం పంచాయతీ పరిధిలో బొజ్జన్న కొండపై బర్మాకు చెందిన బౌద్ధ భిక్షువులు బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బౌద్ద భిక్షువు డాక్టర్ వెనరబుల్ అయిపాల భాన్తేజీ మాట్లాడుతూ.. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధ క్షేత్రం బొజ్జన్న కొండ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు బౌద్ధ శిల్ప సంపదను కాపాడుకోవాలన్నారు.