మెగాస్టార్ చిరంజీవికి శస్త్ర చికిత్స జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ‘మన శంకరవరప్రసాద్‌గారు’ నిర్మాత సాహు గారపాటి స్పందించాడు. చిరంజీవికి కాలి నొప్పి సమస్యలు ఏమీ లేవని.. ఇటువంటి నిరాధార వార్తలు నమ్మొద్దని వెల్లడించాడు. రేపు జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌తో పాటు, సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ హాజరవుతారని స్పష్టం చేశాడు.