AP: పార్వతీపురం సీతంపేటలో వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. గిరిజనులకు వైద్యసేవలు అందించేందుకు మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయకృష్ణ, కలెక్టర్, డీఎంహెచ్వో పాల్గొన్నారు.