KNR: హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే.. అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తానని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ హుజరాబాద్ జమ్మికుంటలో ఆయన పర్యటించారు. రాష్ట్రంలో, ఆయా మున్సిపాలిటీలల్లో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ది పనులు చేస్తున్నామని చెప్పారు.