అనంతపురంలోని అహుడా కార్యాలయంలో ఇంఛార్జ్ జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ గురువారం సమీక్ష నిర్వహించారు. LRS దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెనుగొండ, మడకశిర, కొనుతూరు లేఅవుట్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి, అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.