హిందూవులకు చార్ ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఆరునెలల పాటు తెరచి ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. అయితే చార్ ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు.
Char Dham: హిందూవులకు చార్ ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఆరునెలల పాటు తెరచి ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. మే 10న కేదార్నాథ్ తలుపులు తెరుచుకున్నాయి. అప్పటినుంచి లక్షల మంది భక్తులు చార్ ధామ్‌ను సందర్శించారు.
ఇదిలా ఉండగా చార్ ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు. డెహ్రాడూన్‌లో చార్ధామ్ యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కొందరు భక్తుల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇక నుంచి ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందన్నారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేయడం భక్తులకు ఇబ్బందిగా మారింది. భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా సినిమా పాటలకు నృత్యాలు చేస్తున్నారని తెలిసింది. ఇవి వారి మత విశ్వాసాలను దెబ్బతీస్తోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాధా రాటూరి తెలిపారు.