Shaila Rani: బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి రావత్ మృతి
బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి ఆనారోగ్యంతో మరణించారు. గత కొంత కాలంగా వెన్నుముక గాయంతో చికిత్స పొందుతున్న శైలా రాణి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంగళవారం రాత్రి మరణించారు. దీంతో పార్టీ శ్రేణులు నివాళ్లు అర్పిస్తున్నారు.
Shaila Rani: బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి ఆనారోగ్యంతో మరణించారు. గత కొంత కాలంగా వెన్నుముక గాయంతో చికిత్స పొందుతున్న శైలా రాణి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంగళవారం రాత్రి మరణించారు. దీంతో పార్టీ శ్రేణులు నివాళ్లు అర్పిస్తున్నారు. ఉత్తరాఖండ్ జిల్లాలోని కేదార్నాథ్ ఎమ్మెల్యే (Kedarnath MLA) శైలా రాణి రావత్ (Shaila Rani Rawat) డెహ్రాడూన్ (Dehradun)లోని మ్యాక్స్ ఆసుపత్రిలో (Max Hospital) మరణించారు. 68 ఏళ్ల శైలా రాణి చాలా కాలంగా వెన్నెముక గాయంతో బాధపడుతున్నారు. దీంతో చికిత్స కోసం ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు వెంటిలేటర్‌పై పెట్టి వైద్యం చేస్తున్నారు. వయోభారం కారణంగా చికిత్సకు తన శరీరం సహరించలేదు. దీంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా కేదార్నాథ్ నియోజకవర్గం నుంచి శైలారాణి రావత్ 2012లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తొలిసారి కేదార్నాథ్ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఆ తరువాత 2016లో అప్పటి సీఎం హరీష్ రావత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అనంతరం వచ్చిన 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దాంతో పార్టీని వీడినట్లు వార్తలు వచ్చారు. అనుకున్నట్లుగానే 2022లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపొందారు.