»A Dehradun Girl Who Forced A Dog To Drink Beer Went Viral On Social Media
Viral News: సోషల్ మీడియా హైప్ కోసం కుక్కకు బీర్ తాగించి..
సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ఇప్పటి యువత చేస్తున్న పిచ్చిపనులను చూస్తూనే ఉన్నాయి. ఓ యువతి కూడా దానికోసమే తాపత్రయపడి తన పెంపుడు జంతువుకు బలవంతంగా బీర్ తాగించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
A Dehradun girl who forced a dog to drink beer went viral on social media
Viral News: చాలా మందికి జంతువులు అంటే ఇష్టం ఉంటుంది. కుక్క (Dog)ల విషయంలో ఇంకా ఎక్కువ మక్కువ ఉంటుంది. దీనిపై గతంలో కవులు ఎన్నో కవిత్వాలు (Poems) కూడా రాశారు. తన ప్రేయసి చేతిలో కుక్కను అయినా బాగుండు లాంటి ఎన్నో లైన్స్ సినిమా(Movies)ల్లో, పుస్తకా(Books)ల్లో చదివాము. ఓ యువతి (Young Girl) సోషల్ మీడియా (Social Media)లో వైరల్ కావడానికి తన పెంపుడు కుక్కకు ఇష్టం లేకున్నా బలవంతంగా బీర్ తాగించింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది.
డెహ్రాడూన్‌కు చెందిన ఓ అమ్మాయి కుక్కను పెంచుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ తన పెట్‌కు బీర్ తాగించడం బాలేదు. ఇదే విషయాన్ని ప్రముఖ సామాజిక వేత్త దీపికా నారాయణ్ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిల్లర పనులు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ కావాలని అనుకుంటున్నారని రాసుకొచ్చింది. దీనిపై చాలా మంది నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఎమో తాగడానికి మాకు లేవని బాధపడుతుంటే ఆమె తన కుక్కకు పోస్తున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తాను అనుకున్నట్లు వైరల్ అయింది. అది మంచి పని చేస్తూ అయితే చెప్పుకోవడానికి కూడా బాగుంటుందని మరి కొంత మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.