మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. నవంబర్ 1న వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. కానీ ఇప్పటి వరకు అత్తారింటికి వెళ్లలేదు వరుణ్ తేజ్. అందుకే తాజాగా అత్తారింట్లో అడుగుపెట్టాడు.
నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకుని..నవంబర్ 5న ఇండియాలో గ్రాండ్‌గా రిసెప్షన్ చేసుకున్నారు వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఇక రిసెప్షన్ తర్వాత మెగా ఇంట అడుగు పెట్టింది లావణ్య త్రిపాఠి. దీపావళీని కూడా అత్తారింట్లోనే జరుపుకుంది లావణ్య. కానీ వరుణ్ తేజ్ మాత్రం పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లలేదు. తాజాగా భార్యతో కలిసి లావణ్య సొంత ఊరికి వెళ్లాడు వరుణ్ తేజ్. లావణ్య త్రిపాఠి సొంతూరు ఉత్తరప్రదేశ్. కానీ ఆమె చిన్నతనంలో ఫ్యామిలీ అంతా ఉత్తరాఖండ్‌కు మకాం మార్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్(dehradun)లో లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ఉంటోంది. దీంతో.. పెళ్లి తర్వాత తొలిసారి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట అక్కడికి వెళ్లింది.
బుధవారం ఉదయం హైదరాబాద్(hyderabad) ఎయిర్ పోర్టులో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి దంపతులు కనిపించారు. ఈ కొత్త జంటతో పాటు మెగా డాటర్ నిహారిక(niharika) కొణిదెల కూడా ఉంది. కొన్ని రోజులు అత్తారింట్లోనే ఉండనున్నాడు వరుణ్ తేజ్. అంతేకాదు.. లావణ్య ఫ్యామిలీ డెహ్రాడూన్‌లో మరో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారట. పెళ్లి ఇటలీ, రిసెప్షన్ హైదరాబాద్‌లో జరగడంతో లావణ్య తరుపు బంధువులు అందరూ హాజరు కాలేకపోయారట. అందుకే..తమ సొంత ఊరులో కూడా ఒక చిన్నపాటి రిపెప్షన్ ప్లానింగ్‌లో ఉన్నారట. అందుకోసమే.. ఈ కొత్త జంట డెహ్రాడూన్ బయల్దేరి వెళ్లారట. ఇకపోతే.. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ‘ఆపరేషన్ వేలంటైన్’. మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ 8న ఆడియెన్స్ ముందుకు రానుంది.