మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా.. మెగా బ్రాండ్‌తో నిహారికకి మంచి పాపులారిటీ ఉంది. పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్న నిహారిక.. ఇప్పుడు సినిమాల పరంగా సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో ఏకంగా 11 మంది కుర్రాళ్లతో సినిమా చేస్తోంది.
Niharika: కెరీర్ స్టార్టింగ్‌లో ఏవో సిరీస్‌లు, షార్ట్స్ ఫిల్మ్స్ , సినిమాలు కూడా చేసింది నిహారిక. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. అయితే.. కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది ఈ మెగాడాటర్. ఇక డివోర్స్ తీసుకున్న తర్వాత ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాతగా కూడా సత్తా చాటడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తోంది నిహారిక. ఈ బ్యానర్ పై ఓటిటికి కంటెంట్ కూడా అందిస్తోంది. అలాగే.. హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. రీ ఎంట్రీలో మళయాళీ హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఎస్సార్ ప్రొడక్షన్ బ్యానర్ పై, బి జగదీశ్ నిర్మిస్తున్న చిత్రంలో నిహారిక హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది.
మలయాళంలో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆర్డీఎక్స్ సినిమాలో హీరోగా చేసిన షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘మద్రాస్ కారన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుంది. అంతేకాదు.. తెలుగులో ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిహారిక.. ఇప్పుడు 11 మంది కుర్రాళ్లను పరిచయం చేయబోతుందట. ఒకే సినిమాలో ఇంత మంది హీరోలన ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీ అవుతోందట. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో రానున్న ఓ సినిమాలో.. పదకొండు మంది కొత్త కుర్రాళ్లని హీరోగా పరిచయం చేయనుందట. అలాగే నలుగురు అమ్మాయిలకు హీరోయిన్లుగా పరిచయం చేయనుందట. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ రానుందని సమాచారం.