What the fish: ఫస్ట్ లుక్..సెగలు రేపుతున్న కొణిదెల నిహారిక
మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సినిమాల పరంగా స్పీడ్ పెంచింది. సిరీస్‌లు, సినిమాలు కమిట్ అవుతోంది. గతంలో హీరోయిన్గా ట్రై చేసిన నిహారిక..మధ్యలో పెళ్లి చేసుకుంది. కానీ విడాకుల తర్వాత మళ్లీ హీరోయిన్గా ట్రై చేస్తోంది.
వాట్ ది ఫిష్(what the fish)..అనే టైటిల్‌తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి..రీ ఎంట్రీ ఇస్తున్నానని అనౌన్స్ చేశాడు మంచు మనోజ్. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్‌తో మెగా డాటర్ నిహారిక నుంచి ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. విశాల్ అండ్ సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 18న నిహారిక బర్త్ డే సందర్భంగా.. ఈ సినిమాలో నిహారిక(konidela niharika) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో, నిహారిక తన వెనుక డాలర్ ఇమేజ్‌తో స్టైలిష్‌గా నడుస్తూ హాట్ హాట్‌గా కాస్త షాకింగ్ లుక్‌లో కనిపిస్తోంది.
విడాకుల తర్వాత సినిమాల పరంగా జోష్ పెంచిన నిహారిక..ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌తో షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గతంలో హీరోయిన్గా నిహారిక పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నటన వైపు దృష్టి పెట్టి.. సిరీస్‌లు, సినిమాలకు ఓకే చెప్తుంది. ఈ క్రమంలోనే వాట్ ది ఫిష్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో అష్టలక్ష్మీ అనే పాత్రలో నిహారిక కనిపించనుంది. ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా రూపొందించబడిందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.
పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్, యాక్షన్-ఆధారిత క్యారెక్టర్ అని తెలిపారు. వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే..ఈ సినిమాలో నిహారిక.. మంచు మనోజ్ సరసన హీరోయిన్గా నటిస్తుందా? లేదంటే, మనోజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా? లేడీ ఓరియెంటేడ్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందా? అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.