»In Front Of A Hundred People It Is Very Difficult To Do That
Anupama Parameshwaran: వంద మంది ముందు.. అలా చేయాలంటే చాలా ఇబ్బంది!
ప్రస్తుతం తెలుగులో కాస్త పద్ధతైన హీరోయిన్ల లిస్ట్ తీస్తే.. అందులో అనుపమా పరమేశ్వరన్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. కానీ ఇప్పుడు అను కూడా యూటర్న్ తీసుకుంది. డీజె టిల్లు సీక్వెల్లో రొమాన్స్‌తో రెచ్చిపోయింది అమ్మడు. కానీ అదంతా ఈజీ కాదంటోంది.
In front of a hundred people.. It is very difficult to do that!
Anupama Parameshwaran: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా ఎక్స్‌పోజింగ్‌కు ఛాన్స్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ వస్తోంది క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. అందుకే కుర్రాళ్లకు అనుపమా డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. యూత్‌లో అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ గ్లామర్ ఫీల్డ్ అన్నాక హద్దులు పెట్టుకుంటే కుదరదు. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక కొత్త అనుపమాను చూస్తారని.. ఎప్పుడో యూ టర్న్ తీసుకుంది అను. రౌడీ బాయ్స్ సినిమాలోనే లిప్ లాక్ సీన్లలో నటించి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు.. టిల్లు స్క్వేర్ సినిమాతో మరింత టెంప్ట్ చేయడానికి వచ్చేస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్‌తో రెచ్చిపోయినట్టుగా.. ఇప్పటికే టీజర్‌తో చెప్పేశారు మేకర్స్. లిప్ లాక్ మాత్రమే కాదు.. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి గ్లామర్ డోస్ కూడా పెంచేసింది.
దీంతో అనుపమ అభిమానులు టిల్లు స్క్వేర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మార్చి 29న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది అను. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పదే పదే రొమాంటిక్ సీన్స్ గురించి అడుగుతున్నారు.. కానీ రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు. వంద మంది చుట్టూ ఉండగా, సెట్ యూనిట్ ముందు అలాంటి సీన్ చేయడం అంటే చాలా కష్టం.. చాలా ఇబ్బందిరంగాగా ఉంటుంది. అందరూ ఈ సినిమాలో కార్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో నేను చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాను. కానీ తప్పదని, నిజంగానే రొమాన్స్ చేస్తున్నట్లుగా నటించాలి. చూసిన వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు.. కానీ అది కరెక్ట్ కాదు.. అని చెప్పుకొచ్చింది అమ్మడు. మరి అనుపమా రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.