Inimel: శృతి హాసన్‌తో రొమాన్స్.. భయపడ్డ స్టార్ డైరెక్టర్?
స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌తో రొమాన్స్ అంటే, ఎవ్వరైనా భయపడతారా? ఛాన్సే లేదు. కానీ ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం రొమాన్స్ అనగానే భయపడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా శృతి హాసన్‌నే చెప్పుకొచ్చింది.
Romance with Shruti Haasan.. star director scared?
Inimel: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాదిలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో అలరించిన శృతి.. చివరగా సలార్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే.. శృతి హాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. తనో మంచి గాయని మరియు సంగీత దర్శకురాలు కూడా. అప్పుడప్పుడు తన గొంతును సవరిస్తూ.. అదిరిపోయే ఆల్బమ్స్ చేస్తుంటుంది అమ్మడు. ఈ నేపథ్యంలో తాజాగా ఇనిమెల్ అనే సాంగ్ ఒకటి చేసింది శృతి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పాటలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి నటించింది అమ్మడు. అంతేకాదు.. అతనితో కలిసి ఓ రేంజ్లో రొమాన్స్ చేసింది. లేటెస్ట్‌గానే ఈ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ వీడియో సాంగ్ చూసిన తర్వాత లోకేష్‌ను చూసి షాక్ అయ్యారు ఆడియెన్స్. లోకేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ చెవులు కొరుక్కున్నారు. ఎందుకంటే.. శృతి హాసన్‌తో ఓ రేంజ్లో రెచ్చిపోయాడు లోకష్. లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సాంగ్ రొమాంటిక్ టచ్‌తో అదిరిపోయింది. ఇక ఈ సాంగ్ గురించి శృతి హాసన్ మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. ముందుగా ఈ సాంగ్‌లో నటించడానికి లోకేష్ కానగరాజ్ ఒప్పుకోలేదట. తనతో రొమాన్స్ అనగానే కాస్త భయపడ్డాడని.. కానీ లోకేష్‌ని ఒప్పించి ఈ సాంగ్‌లో నటించేలా చేశామని.. చెప్పుకొచ్చింది. అలాగే.. లోకేష్ కానగరాజ్లో దర్శకుడే కాకుండా గొప్ప నటుడు కూడా ఉన్నాడని చెప్పింది. ఏదేమైనా.. అప్పటి వరకు డైరెక్టర్‌గా ఉన్న లోకేష్.. ఇనిమెల్ సాంగ్‌తో తనలోని మరో కోణాన్ని చూపించేశాడు.