జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్‌కి వెళ్లాడు తారక్. కానీ జాన్వీ మాత్ర సోలోగానే ఫ్లైట్ ఎక్కేసింది.
'Devara' romance in Thailand.. NTR with family, Jhanvi solo!
Devara: అక్టోబర్ 10న రావాల్సిన దేవర పార్ట్ 1 ప్రీపోన్ అయి.. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘ఫియర్ సాంగ్’కు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఈ పాటలో టైగర్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. దేవర ముంగిట నువ్వెంత.. అంటూ వచ్చిన ఫియర్ సాంగ్ సముద్ర తీరాన ఊచకోతకు శాంపిల్‌గా ఉంది. ఇదే కాదు.. ఇప్పటి వరకు దేవర నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన కూడా.. సముద్రం ఎరుపెక్కేలానే ఉంది. కానీ ఈసారి వచ్చే అప్డేట్ మాత్రం వేరే అని అంటున్నారు. ఈసారి దేవరలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించబోతున్నాడట కోరటాల. త్వరలోనే దేవర రెండో పాట రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనిరుధ్ సూపర్ మెలోడి ట్యూన్ రెడీ చేశాడట. ఈ పాట పూర్తిగా రొమాంటిక్‌గా సముద్ర తీరంలో సాగనుంది. విఎఫ్ఎక్స్తో పాటు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లుక్స్ అదిరిపోతాయని అంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రీసెంట్‌గానే గోవాలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు మరో షెడ్యూల్‌కి రెడీ అయిపోయింది దేవర యూనిట్. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో భారీ సెట్టింగులు, గోవా సముద్ర తీరాన దేవరను షూట్ చేసిన కొరటాల.. ఇప్పుడు థాయ్‌లాండ్‌లో ప్లాన్ చేశాడు. రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌కు ఫ్యామితో కలిసి వెళ్లాడు ఎన్టీఆర్. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కనిపించాడు. దేవర షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు ఫ్యామిలీతో వెకేషన్‌ను ఎంజాయ్ చేయనున్నాడు తారక్. మరోవైపు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా థాయ్‌లాండ్ ఫ్లైట్ ఎక్కేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.