Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ మధ్య ఆయన షూటింగ్ విషయాల కన్నా ప్రభాస్ పర్సనల్ విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వార్త వైరల్‌గా మారింది. తరుచుగా లండన్ వెళ్తున్నట్లు అనేక కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకే ప్రభాస్ సమయం దొరికనప్పుడల్లా వెకేషన్స్ కోసం లండన్ వెళ్తున్నాడు. ప్రశాంతంగా అదే ఇంట్లో సేద తీరుతున్నారు అని తెలుస్తుంది. దాన్ని కొనడానికి ముందు కూడా డార్లింగ్ లండన్ వెళ్లినప్పుడు అదే ఇంట్లో ఉండేవారని.. అందుకోసం రూ.కోటి వరకు అద్దె చెల్లించేవారని తెలుస్తుంది. ఇక ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తానికి దాన్ని సొంతం చేసుకున్నారట. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన లేదు కానీ ఇదే నిజమని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు దాని సీక్వెల్‌తో రాబోతున్నారు. దీనికి ముందు కల్కితో మే29న పలకరించనున్నారు. ఈ చిత్రం ఎపిక్ సైన్స్‌ఫిక్షన్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడీపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పోషిస్తోన్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలుస్తుందని ఇటీవలే నిర్మాత స్వప్నదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.