యాంకర్ ప్రదీప్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై దూసుకుపోతున్న ప్రదీప్ సినిమాలు కూడా చేస్తున్నాడు. హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. హీరోగా ఓ సినిమా చేసి గ్యాప్ తీసుకున్న ప్రదీప్.. ఇప్పుడు ఓ లేడీ యాంకర్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Pradeep: బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు చాలా పాపులర్ అయ్యాడు. ఎన్నో విజయవంతమైన ప్రోగ్రామ్స్ చేశాడు ప్రదీప్. అయితే.. ప్రదీప్ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ప్రతీసారి ఏదో ఒక షో కోసం ప్రదీప్ పెళ్లి చేసుకుబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. ఎప్పుడు చూడు త్వరలోనే ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ప్రదీప్ మాత్రం పెళ్లి వార్తల పై స్పందించలేదు. అయితే.. బుల్లితెరపై సక్సెస్ ఫుల్ షోలు చేసిన ప్రదీప్.. సినిమాల్లో కూడా సక్సెస్ అయ్యాడు. పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ , కీలక పాత్రల్లో నటించిన ఈ పాపులర్ యాంకర్.. హీరోగా కూడా ఓ సినిమా చేశారు. జులాయి, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మారాడు.
ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అలాగే హీరోగా ప్రదీప్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయినా కూడా ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. ప్రస్తుతం యాంకరింగ్ చేసుకుంటు బిజీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు మళ్లీ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే.. రీసెంట్గా కొన్ని వర్కౌట్స్ ఫోటోలు కూడా షేర్ చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో లేడీ యాంకర్ హీరోయిన్గా నటించనుందని తెలుస్తోంది. టిక్ టాక్, రీల్స్‌తో ఫేమస్ అయి బుల్లితెరపై యాంకర్‌గా దూసుకుపోతున్న దీపికా పిల్లి.. ప్రదీప్ సరసన నటించనుందని సమాచారం. ఇప్పటికే ఒకటి అర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది దీపిక. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.