Tripti Dimri: 14 కోట్లా? హాట్ టాపిక్‌గా మారిన త్రిప్తి డిమ్రి?
హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు వింటేనే కుర్రాళ్లకు నిద్ర రాదు. అనిమల్ సినిమాతో తెగ టెంప్ట్ చేసింది అమ్మడు. త్రిప్తి హాట్‌నెస్‌కు కుర్రాకారు ఫిదా అయిపోయారు. అయితే.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిన త్రిప్తి 14 కోట్లు ఖర్చు చేసిందనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.
Tripti Dimri: అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసిన రాని క్రేజ్ ఒక్క అనిమల్ సినిమాతో సంపాదించుకుంది త్రిప్తి డిమ్రి. రణ్‌బీర్ కపూర్ సరసన హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించినప్పటికీ.. సినిమా చివర్లో వచ్చి కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి. ఏకంగా రష్మికను సైతం డామినేట్ చేసేలా పాపులర్ అయింది. అమ్మడి క్యూట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఈ హాట్ బ్యూటీ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. అనిమల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాలో విపరీతమైన ఫాలోవర్స్ పెరిగిపోయారు. అమ్మడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గ్లామర్ ట్రీట్ ఇస్తు కిక్ ఇస్తోంది.
అయితే.. అనిమల్ సినిమాతో ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిప్తికి కేవలం 40 లక్షల పారితోషికం మాత్రమే చెల్లించారట. కానీ ఇప్పుడు మాత్రం త్రిప్తి గట్టిగా డిమాండ్ చేస్తోందట. అయితే.. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా 14 కోట్లు పెట్టి విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో రెండంతస్తుల బంగ్లాను కొనుగోలు చేసిందట. సుమారు 257 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు కోసం దాదాపు 14 కోట్లు ఖర్చు చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. అమ్మడు చేసింది తక్కువ సినిమాలు, పైగా అనిమల్ ఒక్కటే స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. మరి అప్పుడు త్రిప్తి 14 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కొనుగోలు చేసిందనేది హాట్ టాపిక్‌గా మారింది.