»Another Chance For First Director Samantha Romance With Senior Hero
Samantha: సమంతకు ఫస్ట్ డైరెక్టర్ మరో ఛాన్స్.. సీనియర్ హీరోతో రొమాన్స్?
గత కొన్నాళ్లుగా సినిమాలకంటే.. వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది స్టార్ హీరోయిన్ సమంత. అంతేకాదు.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే.. ఇప్పుడు తనకు హీరోయిన్గా లైఫ్ ఇచ్చిన దర్శకుడితో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది.
Another chance for first director Samantha... Romance with senior hero?
Samantha: గతకొంత కాలం క్రితమే మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సమంత. కొన్నాళ్లు ట్రీట్మెంట్తో పాటు వెకేషన్ కూడా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు సామ్ దాదాపుగా కోలుకున్నట్టేనని చెబుతోంది. దీంతో.. వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతానికి సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఒక్కటి రిలీజ్‌కు రెడీ అవుతోంది. కానీ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా చేయడం లేదు. రీసెంట్‌గానే తన సొంత బ్యానర్లో ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియేంటేడ్ సినిమాను అనౌన్స్ చేసింది. అయితే.. ఇంకా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతోంది సమంత. అయితే.. ఈసారి మళయాళీ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క మలయాళం మూవీలో కూడా నటించలేదు సమంత.
కానీ ఇప్పుడు మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో సమంత హీరోయిన్గా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ థ్రిల్లర్ మూవీ షూట్ ఎక్కువగా చెన్నైలో జరగనుందని అంటున్నాఉ. అయితే ఈ సినిమాలో ముందుగా నయనతారను హీరోయిన్గా ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ ఆమె ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈ ఆఫర్ సమంత దగ్గరికి వచ్చినట్టుగా చెబుతున్నారు. పైగా ఈ సినిమా దర్శకు గౌతమ్ మీననే ఏ మాయ చేశావే సినిమాతో సమంతను హీరోయిన్గా పరిచయం చేశాడు. ఇప్పుడు మరోసారి గౌతమ్, సమంతకు సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ ఇస్తున్నాడనే చెప్పాలి.