యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. మొన్నటి వరకు టాలీవుడ్లో హాట్ కేకులా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. తాజాగా స్టార్ హీరో కొడుకుతో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది.
Srileela: కెరీర్ స్టార్టింగ్‌లో స్టార్ హీరోలకు సైతం డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసిన శ్రీలీల.. ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంది. సినిమా కౌంట్ చూసుకున్న శ్రీలీల.. హిట్టు, ఫట్టు మాత్రం చూసుకోలేదు. దీంతో.. ఊహించిన దానికంటే ముందే అమ్మడి కెరీర్ క్లైమాక్స్‌కు చేరింది. ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ చేతిలో పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రమే ఉంది. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని అంటున్నప్పటీకి.. కొత్త సినిమాలేవి ప్రకటించలేదు. అయితే ఇక్కడ వరస ఫ్లాప్స్ పడడంతో.. ఇక ఛాన్సులు కష్టమే అనే టాక్ కూడా నడుస్తోంది. లేదంటే తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వాలని అనుకుంటుందో ఏమా తెలియదు గానీ.. కోలీవుడ్‌లో మాత్రం శ్రీలీలకు భారీ ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది.
అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో శ్రీలీల ఆఫర్ అందుకుందనే టాక్ ఉంది. అలాగే.. ధమాకా కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ రవితేజ 75వ సినిమాలో నటిస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా బాలీవుడ్లో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీలీలకు బాలీవుడ్లో బడా ఆఫర్ వచ్చినట్టుగా బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్‌లో రావణ్‌గా నటించిన సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్‌తో శ్రీలీల జోడీ కట్టబోతోందట. ఇబ్రహిం ఖాన్ చేస్తున్న ‘దిలర్’ మూవీలో శ్రీలీలని హీరోయిన్గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో.. ఇక పై బాలీవుడ్లో పాగా వేయాలని చూస్తోందట అమ్మడు. ఒకవేళ నిజంగానే శ్రీలీల బాలీవుడ్ ఛాన్స్ కొట్టేస్తే.. అమ్మడు తెలుగు సినిమాలు తగ్గిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.