»Balayya Birthday Gift Adurs Nbk 109 Glimpses Next Level
Balayya Birthday: బాలయ్య బర్త్ డే గిఫ్ట్ అదుర్స్.. ఎన్బీకే 109′ గ్లింప్స్ వేరే లెవల్
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఎన్బీకే109 పేరుతో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
Balayya Birthday Gift Adurs.. NBK 109' Glimpses Next Level
Balayya Birthday: నందమూరి బాలకృష్ణ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఎనర్జీ ఇస్తూ తాజా సినిమా గ్లింప్స్ విడుదల అయింది. బాలయ్య నుంచి సినిమా అంటే ఎలా ఉండాలో ఆయన ఫ్యాన్స్‌కు తెలుసు, ఆయన ఫ్యాన్స్ అభిరుచి ఏంటో యంగ్ డైరెక్టర్ బాబికి తెలుసు. వీరి కాంబినేషన్లో తెరకెక్కతున్న తాజా చిత్రం ఎన్బీకే 109 నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాలయ్య బర్త్ డే స్పెషల్ ఆయన ఫ్యాన్స్ కోసం గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో జాలి, దయ పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా బాలయ్య ఈ చిత్రంలో కనిపంచనున్నట్లు తాజా గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. రెండు చేతులతో లగేజ్ బ్యాగ్‌లను పట్టుకొని ట్రైన్ దిగి నడిచి వస్తుంటే వింటేజ్ బాలయ్యను చూసినట్లు ఉంది.
గ్లింప్స్ చూసుకుంటే దేవుడు చాలా మంచోడయ్య దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు అనే వాయిస్ ఓవర్‌తో మొదలు అవుతోంది. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది జాలీ, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అనే బలమైన డైలాగ్‌తో బాలయ్య ఎంట్రీ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌ను మరో మెట్టు ఎక్కించింది అని చెప్పవచ్చు. ఇది కచ్చితంగా అభిమానులకు పిచ్చేక్కించే సినిమా అవుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వరకే కమర్షల్ సినిమాలు తెరకెక్కించడంలో డైరెక్టర్ బాబి కొల్లు ఓ మెట్టు ఎక్కారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా అలరిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.