న్యాచురల్ స్టార్ పక్కా ప్లానింగ్‌తో ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తు దూసుకుపోతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాను మొదలు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం అంటు వచ్చేస్తున్నాడు.
Glimpses of 'Saripoda Shanivaram'.. He blew me away!
Saripoda Shanivaram: ఓ క్లాస్ సినిమా ఓ మాస్ సినిమా చేస్తూ.. జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. దసరాతో కల్ట్ మాస్ బొమ్మ చూపించిన నాని.. చివరగా హాయ్ నాన్న సినిమాతో సూపర్ క్లాసిక్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరోసారి సరిపోదా శనివారం అనే మాస్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. నానితో అంటే సుందరానికి లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నాని సరసన ప్రియక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఫిబ్రవరి 24 నాని పుట్టినరోజు సందర్భంగా.. బర్త్ డే విష్ చేస్తూ సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్ చేశారు. 1 నిమిషం 25 సెకన్ల రన్ టైంతో వచ్చిన ఈ గ్లింప్స్ అదిరిపోయిందనే చెప్పాలి.
SJ సూర్య వాయిస్‌తో మొదలైన గ్లింప్స్.. కోపాలు రకరకాలు, ఒక్కో మనిషికి కోపం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్దతిగా.. వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. పేరు.. సూర్య, రోజు.. శనివారం అని పవర్ ఫుల్ గ్లింప్స్ కట్ చేశారు. దీంతో.. సరిపోదా శనివారంలో యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరింది. ఈ సినిమాను ఆగస్టు 29న పాన్ ఇండియా లెవల్లో.. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి నాని మరోసారి హ్యాట్రిక్ కొడతాడమోగా చూడాలి.