»Nandamuri Balakrishna Nbk 109 Movie Shooting Started With Bobby Direction
NBK 109: యాక్షన్‌తో బాలయ్య NBK 109 షురూ!
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)..ఈ నలుగురు సీనియర్ హీరోల్లో ప్రస్తుతం బాలయ్య టైం నడుస్తోంది. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు బాలయ్య. తాజాగా మరో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.
NBK 109 movie shooting started with bobby direction
భగవంత్ కేసరి(bhagavanth kesari) సౌండ్ ఇంకా థియేటర్లో వినిపిస్తునే ఉంది. బాక్సాఫీస్ దగ్గర రూ.140 కోట్ల గ్రాస్ రాబట్టిన భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్స్ ఈ నెల 9న గ్రాండ్‌గా జరగనున్నాయి. ఇక ఈ సినిమా థియేటర్ క్లోజింగ్ టైం వచ్చేసింది కాబట్టి.. నెక్స్ట్ సినిమా యాక్షన్‌కు రెడీ అయిపోయారు నందమూరి నటసింహం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్బీకె 109 వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమా.. రెగ్యూలర్ షూటింగ్‌కు రెడీ అయిపోయింది. నేడు ఫస్ట్ షెడ్యూల్‌ను భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ..ఎన్బీకె 109 షూటింగ్ స్టార్ట్ అయిందని తెలిపారు మేకర్స్. ఆ పోస్టర్లో గొడ్డలి దానిమీద స్టైలిష్ గాగుల్స్ కనిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేసినట్టు సమాచారం. ఈ సెట్లో బాలయ్య(Nandamuri Balakrishna) ఎంట్రీ సీన్స్‌తో పాటు.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేయనున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.
బాలయ్య కోసం బాబీ(Bobby Kolli) పవర్ ఫుల్ స్క్రిప్టు రాసుకున్నాడట. మెగాస్టార్‌కు వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ ఇచ్చినట్టుగానే.. బాలయ్యకు మాసివ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం గ్యారెంటీ అని నమ్ముతున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. మరి ఎన్బీకె 109(NBK 109) ఎలా ఉంటుందో చూడాలి.