బాలయ్యతో సినిమాలో బేబీ హీరోయిన్ నటించబోతోందా? అంటే, ఔననే మాట వినిపిస్తోంది. బేబీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది వైష్ణవి చైతన్య. దీంతో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటున్నారు.
NBK 109: అఖండ, వీరసెంహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. ప్రస్తుతం 109వ సినిమా చేస్తున్నారు. NBK 109 అనే వర్కింగ్ టైటిల్లో మొదలు పెట్టిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడంతో.. ఎన్బీకె 109 పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్్గా శ్రద్ధా శ్రీనాథ్ పేరు వినిపిస్తోంది. అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో కలిసి స్టెప్పులేసిన ఊర్వశి రౌటేలా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో తాను పోలీస్‌గా నటిస్తున్నట్లు ఊర్వశి చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఈ సినిమాలో వైష్ణవి కూడా నటిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. భగవంత్ కేసరిలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య కూతురిగా నటించింది శ్రీలీల. ఈ నేపథ్యంలో ఎన్బీకె 109లో వైష్ణవిని కీలక పాత్ర కోసం తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. లేదంటే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న అఖండ2 కోసం వైష్ణవి పేరు పరిశీలిస్తున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటే.. వైష్ణవికి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. బేబీ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటున్న వైష్ణవి దిల్ రాజు బ్యానర్‌తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో అందులోను తెలుగు హీరోయిన్లలో బేబీ మంచి క్రేజ్ ఉంది. అందుకే.. వైష్ణవికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.