AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. టీబ్రేక్ తర్వాత మళ్లీ సభ మొదలవ్వగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పైకి పేపర్లు చించి విసిరారు. అసెంబ్లీలో ఈలల వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన చౌదరి ఈలల బయటకు వెళ్లి వేయండి అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళణ నేపథ్యంలో స్పీకర్ వాళ్లను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.