W.G. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో జలజీవన్ మిషన్ పథకం ద్వారా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ వాటర్ ట్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.