HYD: జపాన్లోని మినమేటా తరహా విషాదం హైదరాబాద్కు రాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామిక వ్యర్థాల వల్ల మూసీ నది, భూగర్భ జలాలు కలుషితమై నల్గొండ జిల్లాతో పాటు జంట నగరాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణపై తక్షణమే మేల్కోకపోతే హైదరాబాద్ నగరం కూడా ఢిల్లీలా మారుతుందని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు.