కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంభిర్ గోకుల్ జీసీస్కెకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ , జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు. ఇటీవల ఆయన గుంటూరులో జరిగిన తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు.