TG: సీఎంగా రేవంత్ ఏడాది కంటే ఎక్కువ ఉండరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. జనగామ జిల్లా ఏర్పాటుకు కడియం శ్రీహరి అడ్డుపడ్డారని విమర్శించారు. స్టేషన్ ఘనపూర్లో ఇకపై కడియం శ్రీహరి ఆటలు సాగవని మండిపడ్డారు. అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా పోరాటాలకు సిద్ధమని చెప్పారు.