Devara Glimpses: గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) విధ్వంసం అంటే ఏంటో, ఊచకోత అంటే ఎలా ఉంటుందో తాజా గ్లింప్స్ తో రుచి చూపించాడు. గర్జించిన పులిలా శత్రుమూకలను నరుకుతుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. చిన్న గ్లింప్స్(Devara Glimpses) లో నే ఇంత బీభత్సం సృష్టిస్తే.. ఇక సిల్వర్ స్క్రీన్ లో ఎలా ఉంటుందో అన్న ఊహే ఆయన అభిమానులకు కొత్త ఉత్సహాన్ని ఇస్తుంది. దేవర ఇది బీభత్సానికి, ఊచకోతకు పర్యాయపదం. నేత్తుటేరులు పారుతుంటే శత్రువులను నరికిన ఆయుధంపై రక్తపు మరకలను కడగడం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూసిండాది అందుకే దీనికి ఎర్ర సముద్రం అని ఎన్టీఆర్ చెప్పె డైలాగ్ గూజ్ బంప్స్ తెప్పిస్తోంది. కేవలం ఒక గ్లింప్స్ తో ఇంత హైప్ తీసుకురావడం అంటే అది దేవరకే చెల్లుతుంది.
కొరటాల శివ దర్శకత్వంలో కొత్త ఎన్టీఆర్ దర్శనిమిచ్చాడు అని అభిమానులు కాలర్ ఎగరేసుకుంటున్నారు. చెవికి పోగూ, కాలికి కడియం, లింగీ, రింగుల జుట్టు.. ఇది నిలువెత్తు ఎన్టీఆర్ రూపం.. ఇది కచ్చితంగా ఊరమాస్ యాక్షన్ జాతర చిత్రమే అని కన్ఫామ్ అయింది. దేవరను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ప్రిల్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ తో పోటీపడడానికి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో అలరిస్తున్నాడు. సెన్సెషనల్ మ్యూజిక్ డైెరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో గ్లింప్స్ ను పిచ్చిక్కించేశాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుంది.