Vijay-Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డితో తనకంటూ కల్ట్ ఫ్యాన్ బేస్ పెంచుకొని స్టార్ హీరోల వరుసలో నిలబడ్డారు. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరవ్వాలని గీతాగోవిందం అనే చిత్రంతో పలకరించారు. పరసురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీస్ కు బాగా చేరువైంది. దాంతో హీరోగా కుటుంబ కథా చిత్రాలల్లో కూడా మెప్పిస్తాడని నిరూపించుకున్నారు. అంతే కాదండోయ్ ఆ సినిమాలో హీరోయిన్ తో కెమిస్ట్రి బాగా కుదరడంతో ఇద్దరి మధ్య కుచ్ కుచ్ హోతాహై అని వార్తల్లో కూడా నిలిచారు.
ఇక రష్మిక మందన్న. కిర్రాక్ పార్టీ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసి ఛలో అంటూ విజయ్ పక్కన గీతా క్యారెక్టర్ కొట్టేసింది. వీరి ఆన్ స్క్రీన్ పెయిర్ బాగుంది. దాంతో ఆఫ్ స్క్రీన్ లో కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ప్రమోషన్లో ఒకరిని ఒకరు టీజ్ చేసుకోవడం ప్రేక్షకులకు నచ్చింది. దాంతో వీరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చింది. ఆ సినిమానే డియర్ కామ్రెడ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్గగా ఆడలేదు కానీ వీరి బంధం మాత్రం ఇంకా బలపడింది. ఇక ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని పలు మీడియా సంస్థలు ఎన్ని కథనాలు రాసినా వీరు దేనికి స్పందించలేదు. ఇద్దరు కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఆ మధ్య సేమ్ సన్ సెట్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అయినా వీరిలో ఎవరు స్పందించలేదు. తరువాత రష్మిక తన అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించిందని వార్తులు వైరల్ అయినా ఖాతరు చేయలేదు. దీంతో వీరిద్దరి నడుమ ఏదో ఉందనేది బలంగా వినిపించింది.
తాజాగా నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ దేవరకొండ త్వరలో నిశ్చితార్థం అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరీ దీనిపై అన్నా వారు స్పందిస్తారో లేదా ఎప్పటి లానే ఊరుకుంటారో చూడాలి.
హీరోయిన్ సమంతా, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ఖుషి. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదన్న విషయం తెలిసిందే. ఇక పరసురామ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృణల్ ఠాకూర్ విజయ్ సరసన నటిస్తోంది. దీని తరువాత నెక్ట్స్ లైనప్ లో గౌతమ్ తిన్ననూరి చిత్రం ఉంది. దీనిలో కూడా రష్మికానే హీరోయిన్. అనిమల్ చిత్రంలో బాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది.