Rashmika: మగవారికి మద్దతుగా రష్మిక.. రిప్లై వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయాన్గా ఓ రేంజ్లో దూసుకుపోతోంది అమ్మడు. అలాగే.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా మగవారికి మద్దతుగా చేసిన రిప్లై ఒకటి వైరల్‌గా మారింది.
Rashmika: ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్‌గా మారిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్‌తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే.. ఈ సినిమా విషయంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అనిమల్ను విమర్శించిన వారిని కౌంటర్ ఎటాక్ చేశాడు సందీప్. ఎవ్వరు ఏమి మాట్లాడిన ఇచ్చి పడేశాడు. సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఏకంగా 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయినా కూడా అనిమల్ సినిమా పై ఏదో ఒక రచ్చ జరుగుతునే ఉంది.
చదవండి:Pushpa 2: పుష్ప 2.. సుకుమార్ బిగ్ షాక్?
తాజాగా అలాంటి వారికి రిష్మిక దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. ఓ ట్విట్టర్లో ఓ లేడీ నెటిజన్ అనిమల్ సినిమాలో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘మనిషిని నమ్మడం కంటే భయంకరమైనది మరొకటి లేదని గుర్తుంచుకోండి..’ అంటూ రాసుకచ్చింది. అనిమల్ సినిమాలో రష్మికను ప్రేమించి పెళ్లాడిన రణ్‌బీర్ కపూర్.. ఆ తర్వాత ఆమెని మోసం చేసి త్రిప్తి డిమ్రితో తిరిగాడని.. సదరు నెటిజన్ పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ రష్మిక కంట పడడంతో అదిరిపోయే రిప్లై ఇచ్చింది. కరెక్షన్: ఒక మూర్ఖుడిని నమ్మడం భయానకం.. కానీ అక్కడ చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు.. ఆ పురుషులను విశ్వసించడం కూడా ప్రత్యేకమైనది..’ అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో.. పురుషులకు సపోర్ట్గాగా నిలిచినందుకు థ్యాంక్స్ అంటు కామెంట్స్ చేస్తున్నారు మగవారు.