»This Is The Look Of Akkineni Akhil Are You Shocked To See This
Akhil: ‘అక్కినేని అఖిల్’ ఇదేం లుక్.. ఇలా చూస్తే షాకే?
ఇప్పటి వరకు అఖిల్‌కు సాలిడ్ హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో.. మాసివ్ హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు అక్కినేని కుర్రాడు. కానీ హిట్ మాత్రం పడడం లేదు. అందుకే.. ఈసారి మాత్రం అఖిల్ అంతకుమించిన సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
This is the look of 'Akkineni Akhil'.. Are you shocked to see this?
Akhil: గత కొంత కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అఖిల్.. తన కెరీర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మాత్రమే ఓ మోస్తారు హిట్ చూశాడు. భారీ అంచనాలతో చివరగా చేసిన ఏజెంట్ సినిమా మాత్రం అఖిల్ కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దర్శకుడు సురేందర్ రెడ్డి పై చాలా నమ్మకంతో ఏజెంట్ కోసం చాలా రిస్క్ చేశాడు అఖిల్. కానీ ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ అఖిల్‌ను కోలుకోకుండా చేసింది. ఎంతలా అంటే.. ఇప్పటివరకు మరో సినిమాని అనౌన్స్ కూడా చేయలేదు. కానీ ఈసారి కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతానికి అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ సోషియో ఫాంటసీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ, గ్రౌండ్ వర్క్ గట్టిగా మాత్రం జరుగుతోంది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయయం కాబోతున్నాడు.
త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. అఖిల్ కెరీర్లోనే ఈ సినిమా హెయెస్ట్ బడ్జెట్‌తో రూపొందనుంది. దీని కోసం అఖిల్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. తాజాగా అఖిల్ నయా లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్‌లో లుక్‌లో కనిపించాడు అఖిల్. దిట్టంగా జుట్టు పెంచేసి, గడ్డం పెంచేసి ఒక బీస్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ కొత్త సినిమా కోసమేనని అంటున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతుంటే.. అఖిల్ కొత్త లుక్ చూస్తుంటే మాత్రం ఊరమాస్ పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం అఖిల్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడనే చెప్పాలి.