»Allegations On Pawan Kalyans Og Film Dvv Entertainment Responded
Pawan Kalyan ఓజీ చిత్రంపై ఆరోపణలు.. స్పందించిన నిర్మాత
పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ అమ్మేసిందని వస్తున్న వార్తలను ఆ ప్రొడక్షన్ హౌస్ కొట్టిపడేసింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
Allegations on Pawan Kalyan's OG film.. DVV Entertainment responded
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఓజీ'(OG). మూడు నెలల క్రితం షూటింగ్ మొదలు పట్టిన ఈ చిత్రం పూణె, ముంబైై వంటి నగరాల్లో షూటింగ్ జరుపుకుంది. ఇంకా ఒక షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉండగా పవన్ రాజకీయంగా బిజీ అయ్యారు. దాంతో ఓజీ కాస్తా డీలా పడింది. ప్రస్తుతం దీనిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ భారీ మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ కు ప్రాజెక్టును అప్పగించేసిందని కథనాలు వచ్చాయి.
దీనిపై డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. “ఓజీ మాదే… ఓజీ ఎప్పటికీ మాదే” అంటూ స్పష్టత నిచ్చింది. పవన్ కల్యాణ్‌తో తీస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని రైట్స్ వాళ్లదగ్గరే ఉన్నాయని, దాన్ని ఎలా నిర్మించాలో, ఎలా బిజినెస్ చేసుకోవాలో తమకు తెలుసని వెల్లడించింది. పవన్ కల్యాణ్ రాజకీయంగా బిజీగా ఉండడం వలన షెడ్యూల్ గ్యాప్ వచ్చిందని పేర్కొంది. “చిరుత బాగా ఆకలి మీద ఉంది… ఒక్కసారి వేటకు వచ్చిందంటే ఇంకేమీ మిగలదు” డీవీవీ ఎంటర్ టైన్మెంట్ స్పష్టం చేసింది.