»Mega Daughter Niharika Romance With Malayalam Hero Shane Nigam
Niharika: మళయాళ హీరోతో మెగా డాటర్ రొమాన్స్!
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఓ విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. విడాకుల తర్వాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసిన నిహారిక.. తాజాగా హీరోయిన్గా ఓ సినిమాకు సైన్ చేసింది.
Mega daughter Niharika romance with Malayalam hero Shane Nigam
Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా.. మెగా బ్రాండ్‌తో నిహారికకి మంచి పాపులారిటీ ఉంది. అప్పట్లో ఏవో సిరీస్‌లు, షార్ట్స్ ఫిల్మ్స్ , సినిమాలు కూడా చేసింది. దాంతో నిహారికకు హీరోయిన్గా తెగ ఇంట్రెస్ట్ ఉందని అంతా అనుకున్నారు. కానీ మెగా అభిమానులు ఆమెను కాస్త వ్యతిరేకించారు. దీంతో సినిమాలకు దూరమైంది నిహారిక. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంది. కానీ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అంతేకాదు ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ కూడా ఇచ్చింది. అలాగే నిర్మాతగా కూడా సత్తా చాటడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తోంది నిహారిక. ఈ బ్యానర్ పై ఓటిటికి కంటెంట్ అందిస్తోంది.
ఇక ఇప్పుడు హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. రీ ఎంట్రీలో మళయాళీ హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఎస్సార్ ప్రొడక్షన్ బ్యానర్ పై, బి జగదీశ్ నిర్మిస్తున్న చిత్రంలో నిహారిక హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. మలయాళంలో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆర్డీఎక్స్ సినిమాలో హీరోగా చేసిన షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘మద్రాస్ కారన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుంది. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ ప్రకటించగా.. నిహారిక కూడా ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. వాట్ ది ఫిష్ అనే సినిమా కూడా చేస్తోంది నిహారిక. రీసెంట్గా ఈ ప్రాజెక్ట్‌ను అఫిషీయల్‌గా అనౌన్స్ చేశారు. మరి హీరోయిన్గా నిహారిక ఎలా రాణిస్తుందో చూడాలి.