»Street Food Vendor Kumari Antti Is Going To Enter Bigg Boss Season 8 Telugu Show
Kumari Aunty : బిగ్‌బాస్-8లోకి వైరల్ కుమారి ఆంటీ!
కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు. ఆమె హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి. యూట్యూబ్ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రచారం చేయడంతో ఆహార ప్రియులు పోటెత్తారు.
Kumari Aunty's food truck was blocked by the traffic police!
Kumari Aunty : కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు. ఆమె హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి. యూట్యూబ్ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రచారం చేయడంతో ఆహార ప్రియులు పోటెత్తారు. చాలా మంది సెలబ్రిటీలు సైతం ఆమె ఆహారాన్ని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో జనం రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని రోడ్లపై ఆహార పదార్థాలు విక్రయించరాదని ఆదేశించారు. ఫుడ్‌స్టాల్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పారు. ఆమె పోలీసులతో తన పొట్ట కొడుతున్నారంటూ వాగ్వాదానికి దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదే విషయం సీఎం రేవంత్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ ఏర్పాటుకు పోలీసులు సహకరించాలని సూచించారు. ఈ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
అయితే బిగ్‌బాస్ సీజన్-8లో కుమారి ఆంటీని కంటెస్టెంట్‌గా తీసుకోవాలని షో నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. కుమారి ఆంటీని బిగ్ బాస్ షోకి తీసుకుంటారనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ మహిళ తన కాళ్లపై తాను నిలబడి.. స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ తన కుటుంబంతో పాటు చాలా మందికి ఉపాధి కల్పిస్తూ బిగ్ బాస్ షో నిర్వాహకుల దృష్టిని ఆకర్షించింది. మహిళా సాధికారత అంటే ఏమిటో కుమారి అంటి నిరూపించింది, అందుకే ఆమెను ఈ షోలో కంటెస్టెంట్‌గా ఎలా తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఆమె ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ షోకి వెళితే.. తన వ్యాపారం ఏమవుతుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. మరి కుమారి అంటి వచ్చే బిగ్ బాస్ సీజన్లో కనిపిస్తుందో లేదో చూద్దాం. మరోవైపు సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫాలోయింగ్ లక్షల్లో పెరుగుతుంది. ఆమె వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తుంది. నటుడు సందీప్ కిషన్ తన ట్విట్టర్లో కుమారి ఆంటీని ప్రశంసిస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. మహిళా సాధికారతకు ఆమె స్ఫూర్తి అని రాశారు. ఆమెకు ఎప్పుడు, ఎక్కడ అవసరమైనా నా టీమ్ సహాయం చేస్తుందని చెప్పాడు.