Guntur : గుంటూరులో కలుషిత నీటి సరఫరా కారణంగా అతిసారం ప్రబలుతోంది. నాలుగు రోజులుగా డయేరియాతో బాధపడుతున్న వారిని ఆస్పత్రిలో చేర్పిస్తున్నారు. డయేరియాతో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే డయేరియా ప్రబలడానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ స్పందించారు. గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు ఆసుపత్రిలో మంచి వైద్యం అందిస్తామని మంత్రి రజిని హామీ ఇచ్చారు.
ప్రజలకు అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నీరు, ఆహారానికి సంబంధించిన 32 నమూనాలను సేకరించారు. ఈ ఘటనపై కలెక్టర్, కమిషనర్ నేతృత్వంలో విచారణ జరుపుతామని ఆమె తెలిపారు. 2018లో కూడా గుంటూరులో విపరీతమైన డయేరియా వచ్చి మృత్యువాత పడ్డారని తెలిపారు. ఆ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి తెలిపారు. విరేచనాలు ప్రబలుతున్నాయని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని మంత్రి తెలిపారు. డయేరియా కోసం హెల్ప్ డెస్క్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశాం. ప్రజలు అనారోగ్యానికి గురైతే తక్షణమే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని మంత్రి విడదల రజిని తెలిపారు.