AP: 90 శాతం హామీలను నెరవేర్చామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అన్నారు. అనంతపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన పల్లా.. అభివృద్ధి, సంపద సృష్టిని సమంగా చేస్తున్నామని తెలిపారు. జగన్ ఫేక్ ప్రచారం చేసి.. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు 24 గంటలూ రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నారన్నారు.