NLR: జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు బుధవారం ఉదయగిరిలోని ఒక ప్రైవేటు పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరు రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.