ఆసియా కప్లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో యూఏఈ జట్టు 11 ఓవర్లలో కేవలం 51 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి యూఏఈ పతనాన్ని శాసించాడు. ఇక బుమ్రా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.