GDWL: ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ కలీంకు రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా పురస్కారం అవార్డు లభించింది. బుధవారం హైదరాబాదులో పారిశ్రామిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉపాధి కల్పన ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. దీంతో జిల్లా అధికారులు బుధవారం వారిని అభినందించి ప్రశంసించారు.