WNP: శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లిలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పది రోజులుగా రోడ్డుపైనే నిలిచిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పది రోజుల క్రితం డీజిల్ అయిపోవడంతో ట్రాక్టర్ను రోడ్డు పక్కన ఆపేశారు. దీంతో చెత్త వేయడానికి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.