NRPT: డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శివశంకర్ అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ వాహనాల డ్రైవర్ పోలీసులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహనాన్ని కండిషన్లో పెట్టుకోవాలని, ఎప్పటికప్పుడు మరమత్తులు చేయించాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.