ఆసియా కప్లో భాగంగా UAEతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. వారి ధాటికి UAE జట్టు కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, శివమ్ దూబే 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు. అలాగే, బుమ్రా, అక్షర్ పటేల్, చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు. UAE బ్యాటర్లలో అలీషన్ (22), ముహమ్మద్ వసీం (19) టాప్ స్కోరర్లుగా నిలిచారు.