HNK: హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఝాన్సీరాణి రవీందర్ బుధవారం కలిశారు. కమలాపూర్ మార్కెట్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించి, సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రి ఛైర్ పర్సన్‌కు సూచించారు.