KMR:వరద విపత్తులో ఎల్లారెడ్డి – కామారెడ్డి రహదారిలో లింగంపల్లి ఖుర్ద్ వద్ద హైలెవల్ వంతెన కొట్టుకుపోయింది. వంతెనను స్వయంగా పరిశీలించిన సీఎం ఆదేశాల మేరకు, డైవర్షన్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1 కోటి నిధులు మంజూరు చేసిందని MLA మదన్ మోహన్ తెలిపారు. రూ.1 కోటి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఆయన బుధవారం వెల్లడించారు.